calender_icon.png 25 October, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ తల్లి ఆలయంలో ఘనంగా గడప ప్రతిష్టాపన

25-10-2025 12:00:00 AM

జిన్నారం, అక్టోబర్ 24 : జిన్నారం పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మతల్లి ఆలయంలో గడప ప్రతిష్ఠాపన కార్యక్ర మం శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ గడప దాత కొల్లూరు నర్సింహ జయలక్ష్మి, దంపతులు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం గౌడ్ దంపతులు ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల ప్రత్యే క పూజా కార్యక్రమాల మధ్య గడప ప్రతిష్టాపన జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, భోజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు ఏర్పుల లింగం, మంద రమేష్, నర్సింగ్ రావు, వెంకటేశం, మల్లేష్, రాము, మహేందర్ నిఖిల్ గౌడ్, కిషన్, దుర్గేశ్, స్థానిక కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.