calender_icon.png 26 October, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

25-10-2025 08:47:51 PM

కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్..

ఇబ్రహీంపట్నం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో శనివారం ఇబ్రహీంపట్నం మండలం, తులేకలాన్ (పెత్తూల్ల) గ్రామంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను లబ్ధిదారులకు కోడూరి రమేష్ అందజేశారు. సమా అలివేలు తండ్రి సమా గోపాల్ రెడ్డికి రూ.60 వేలు, ఎర్నగి మహేందర్ కు రూ.16 వేలు ఇప్పించడం జరిగింది.

ఈ సందర్బంగా కోడూరి రమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో గ్రంధాలయం ముగింపు దశకు చేరిందని అంగనివాడి బిల్డింగ్ పనులు ప్రారంభించుకోవడం జరిగిందని, సీసీ రోడ్డు,  డ్రైనేజీ పనులతో గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. గ్రామంలో అందరి రేషన్ కార్డు లు ఇప్పించడం జరిగిందనీ, ఇంకా ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో బస్తీ దవాఖాన, స్కూల్ బిల్డింగ్, బ్యాంకు నిర్మిచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోడూరి పండు, సినియర్ నాయకులు సత్తు శేషంక్ రెడ్డి, బండ శ్రీశైలం, పంబలి జంగయ్య, దాసు, బోడ మహేందర్, శ్రీనివాస్ రెడ్డి, గుజ్జా రామయ్య తదితరులు పాల్గొన్నారు.