calender_icon.png 26 October, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా 5కే రన్

25-10-2025 12:00:00 AM

-5కే రన్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహాజన్

ఆదిలాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) :  పోలీసు అమరవీరుల దినో త్సవ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన 5k రన్ కు విశేష స్పందన లభించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం నుండి ప్రారంభమైన  రన్ పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది.

జిల్లా ఎస్పీ స్వయంగా ఐదు కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి సిబ్బందికి, యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రశాంత జిల్లాకు కార ణం ఒకప్పటి పోలీసు ప్రాణ త్యాగాల ఫలితమే అని, వారి జ్ఞాపకార్థం, వారి త్యాగాలను స్మరి స్తూ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంద న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి సురేందర్‌రావు, డీఎస్పీలు పోతా రం శ్రీనివా స్, జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, హాసీబుల్ల, పట్టణ సిఐలు, ఎస్‌ఐలు, యువత, స్పోర్ట్స్ పాఠశాల విద్యార్థిను పాల్గొన్నారు.