25-10-2025 08:58:30 PM
ఇబ్రహీంపట్నం: తుర్కయంజాల్ ఇండస్ వ్యాలీ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వైపు వెళ్తుండగా, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో తుర్కయంజాల్ బ్రాంచ్, ఇండస్ వ్యాలీ స్కూల్ కు సంబంధించిన బస్సును నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా వచ్చి, ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వినోద్ (22), అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకునీ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.