calender_icon.png 26 October, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల పాఠశాలలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు

25-10-2025 09:08:44 PM

హాజరైన లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్..

చిట్యాల (విజయక్రాంతి): రామన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో లీగల్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్ పాఠశాలలో శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకి అవగాహన కల్పించి, విద్యార్దులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్దులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన ఉండాలని, బయట సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల అగత్యాలు జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, అవగాహన ముఖ్యం అని అన్నారు.

విద్య హక్కు చట్టం, పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలు, బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్ధులకి ఏదైనా ఇబ్బందులు ఉంటే లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా లీగల్ సర్వీసెస్ దృష్టికి తీసుకువచ్చి, సమస్యలు పరిష్కారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్దులు పాల్గొన్నారు.