25-10-2025 08:55:33 PM
చొప్పదండి,(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుక్మాపూర్, చొప్పదండి వడ్ల కొనుగోలు కేంద్రాలను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ప్రభుత్వం కల్పించే మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చొప్పదండిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు ప్రారంభించారు. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉందని కావున రైతులు కొనుగోలు కేంద్రంలోని అమ్ముకొని మద్దతు ద్వారా పొందాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు శ్రీ వెల్మ మల్లారెడ్డి గారు మొక్కజొన్న ఎకరాకి కేవలం 18.50 క్వింటాళ్ల మక్కలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ నిబంధనను ఎత్తివేసి రైతులు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గారికి విన్నవించారు దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.