25-10-2025 08:58:41 PM
కాకతీయ యూనివర్సిటీ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ, ఇంజనీరింగ్ కళాశాల (కో ఎడ్యుకేషన్) ఒప్పంద అధ్యాపకులు డాక్టర్ పాకల సంతోష్ కుమార్ కు “బ్రెయిన్ ఓ విజన్” సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని టి.హబ్ ప్రాంగణంలో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో “నిక్విటి అవార్డ్” (యంగ్ డాక్టరేట్ కేటగిరీ) విభాగంలో అవుట్‌స్టాండింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ అవార్డుని అందుకున్నారు.
2025 సంవత్సరంలో 152 ప్లేస్‌మెంట్లు, 2026 సంవత్సరానికి 93 ప్లేస్‌మెంట్లు సాధించడంలో ఆయన చూపిన అద్భుతమైన కృషికి గాను ఈ అవార్డు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును కార్యక్రమంలోని ప్రధాన అతిథులు శ్రీ బుద్ధ చంద్రశేఖర్, AICTE చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, జేఎన్‌టీయూ కాకినాడ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చెకూరి శివరామకృష్ణ ప్రసాద్ అందజేశారు. ఈ గౌరవం డా. సంథోష్ కుమార్ విద్యార్థుల ఉపాధి అభివృద్ధి పట్ల అంకితభావం, నాయకత్వం, నిరంతర కృషికి కాకతీయ విశ్వవిద్యాలయ, ఇంజనీరింగ్ కళాశాల (కో ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. రమణ, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, అబినందించారు.