25-10-2025 08:51:24 PM
వరంగల్,(విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే(ఐజేయు)కమిటీ ఆధ్వర్యంలో శనివారం పీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో శ్రీరామ్ రాంచందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులకు నూతన సభ్యులను నియమించారు. జాయింట్ సెక్రటరీగా బదావత్ బాలాజీ (ఆంధ్రప్రభ, వరంగల్), కార్యవర్గ సభ్యులుగా గూగులోతు నరసింహ (ప్రజాపక్షం. చెన్నారావుపేట మండలం), గాదెం రవి (తెలుగు పత్రిక, దుగ్గొండి మండలం)లను ఎంపిక చేశారు. అదేవిధంగా, వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీని కూడా ఈ సమావేశంలో నియమించారు.
అధ్యక్షుడిగా కందుల శ్రీధర్ (99టీవీ వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్), ప్రధాన కార్యదర్శి ఊరటి రాజు (బీఆర్కే న్యూస్ నర్సంపేట), కోశాధికారిగా ఎండీ నాజర్ (ఆర్ టీవీ వర్ధన్నపేట), ఉపాధ్యక్షులుగా తరాల రవితేజ, (స్వతంత్ర టీవీ వరంగల్ ఈస్ట్),దైనంపల్లి చైతన్య (సిటీ న్యూస్, వరంగల్ ఈస్ట్), అమ్మ రాజు (10 టీ వీ నర్సంపేట), సహాయ కార్యదర్శులుగా బేతి ఉమాశంకర్ (వీ5 న్యూస్ వరంగల్ ఈస్ట్), సిద్దోజు నితీష్ (క్యూ న్యూస్ వరంగల్ ఈస్ట్), వీకే రవీందర్,(మహ న్యూస్ వర్ధన్నపేట), కార్యవర్గ సభ్యులుగా పెసరి రాజేంద్రప్రసాద్, (భారత్ టుడే వరంగల్), మేరుగు రాము,( వీ6 నర్సంపేట), ఆగారపు స్వామి (ఎస్6 నర్సంపేట), మునుగోటి అనిల్ కుమార్ (ఎన్ టీవీ) వర్ధన్నపేట ఎన్నికయ్యారు.