calender_icon.png 28 October, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా లక్ష్మీసత్తి, రూపసత్తి జాతర

25-10-2025 12:00:00 AM

కొండాపూర్, అక్టోబర్ 24 : గిరిజనుల ఆరాధ్య దైవం లక్ష్మీసత్తి, రూపా సత్తి జాతర ఉత్సవాలు కొండాపూర్ లో ఘనంగా జరిగాయి. శుక్రవారం మండల కేంద్రమైన కొండాపూర్లో లక్ష్మీ సత్తి, రూపా సత్తి ఆలయాల్లో నిజామాబాద్, మహబూబ్ నగర్, బాన్సవాడ, షాద్ నగర్, వికారాబాద్, ఎల్లారెడ్డి ప్రాంతాలకు చెందిన లలావత్ పాడా, కేతవ త్ పాడా వంశస్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి తమ మొ క్కులను చెల్లించుకున్నారు.

తమ చిన్నారుల పుట్టు వెంట్రుకలను అమ్మవారి సమర్పించారు. భక్తులకు ఉచిత అన్నదాన. ప్రసాదాల ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోతిలాల్, వంశస్థులు గొప్యానాయ క్, సిరి చంద్, ప్రకాష్, బీర్ మల్, తార చంద్, శ్రీను, రూప్ సింగ్, మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.