25-10-2025 12:00:00 AM
-బండి ప్రకాశ్ లొంగుబాటుపై ప్రచారం
-తెరపైకి సికాస భవిష్యత్తు చర్చ
-మల్లోజుల వాదనలపై భిన్నవాదనలు
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 24 : నాటి సింగరేణి కార్మికోద్యమ నిర్మాత దేవురీ శేషగిరిరావు నుంచి ఉద్యమాల పురిటి గడ్డ సింగరేణికీ నేటి సికాస వరకూ పోరాట అనుబంధం విడదీయనిది. భారత విప్లవోద్యమం లో తలెత్తిన సంక్షోభం మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మనగడపై ప్రస్తు తం ఎనలేని చర్చ జరుగుతుంది. కేంద్ర కమి టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు తమ సహచర బృందాలతో కలసి ఆయుధాలతో లొంగిపోయినా సంఘటన పై సింగరేణిలో తీవ్ర మైనచర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో సింగరేణి లో సికా స భవిష్యత్ పై, దేశంలోనీ ఆయా రాష్ట్రాల విప్లవోద్యమ మనుగడ పై ఈ చర్చ వాడివేడిగా జరుగుతుంది. మల్లోజుల, ఆశన్నల లొంగుబాటు క్రమంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ఇన్చార్జి బండి ప్రకాష్ పార్టీనీ వీ డినట్లు ప్రచారం సింగరేణి దుమారం లేపుతున్నది. ప్రభుత్వానికి లొంగిపోయాడనికి బండి ప్రకాష్ హైదరాబాద్ లో పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతు న్నది. అయితే మల్లోజుల, ఆశన్న లొంగుబాటు ప్రక్రియ ముగిసిపోయినా నేపథ్యం లో తెలంగాణలో బండి ప్రకాష్ లొంగుబాటు ఘట్టం ఉంటుందని భావించారు.
మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు ముందు సికాస కార్యదర్శి అశోక్ పేరుతో మల్లోజుల సాయుధ విరమణ శాంతి ప్రతిపాదనను సమర్థిస్తున్నామని మొదట విడుదలైన ప్రకటన సింగరేణినీ ఉలికిపాటు కు గురిచేసింది. రెండు వారాల తర్వాత సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని సికాస కార్యదర్శి అశోక్ పేరిట మొదటి ప్రకటనకు ఖండనగా వెలువడిన ప్రకటన సింగ రేణిలో నెలకొన్న అయోమయాన్ని పటాపంచలు చేసింది. మరోవైపుగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో మల్లోజులకు అనుకూల, వ్యతిరేక శ్రేణులు ఉన్నట్లుగా సింగరేణి లో వెలువడిన రెండు రకాల ప్రకటన స్పష్టం చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సికాస పేరిట ఒకే పేరుతో విరుద్ధ ప్రకటనలు వెలువడటoపై సింగరేణి ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.
సమ్మెలోనే పుట్టిన సికాస..
సింగరేణిలో సికాస పుట్టుక చారిత్రక సమ్మేపోరాటమంలోజరిగింది. ఇలాంటి చారిత్రక సందర్భం అరుదుగా ఉంటుంది. 1981 ప్రాంతంలో నల్లా చట్టానికి వ్యతిరేకంగా సింగరేణిలో సమరశీల శిలమైనా, జీవించే ఉద్యోగ హక్కు కోసం తొట్టతొలి సమ్మె. కాగా ఒకరోజు సమ్మె చేస్తే 8 మాస్టర్ల కోత చట్టo రద్దు కోసం జరిగిన సమ్మేది. పోరాట స్రవంతిలోని పురుడు పోసుకున్న సికాస సింగరేణిలో సుదీర్ఘకాలం కార్మికుల హక్కులు , సౌలభ్యాలు,వేజ్ బోర్డుల కోసం సమ్మె పోరాటాలు నడిపింది. ఈ క్రమంలో కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఎంతోమంది యువతీ యువకులు సికాసలో చేరి అసువులు బాసారు.
బండి ప్రకాష్ సికాసకు ఆయువుపట్టు..
ఈ నేపథ్యంలో తీవ్ర స్తబ్దతకు గురై ఎంతో కాలానికి గానీ మందమర్రి కు చెందిన మావోయిస్టు నేత బండి ప్రకాష్ తో సికాస మళ్లీ ఉనికిలోకి వచ్చింది. సికాస కార్యదర్శి అశోక్ పేరుతో ఉనికి కోసం అప్పుడప్పుడూ వెలబడుతోన్న లేఖలు కోల్ బెల్ట్ లో ఒకింత కలకలం రేపేవీ. ఈ క్రమంలో బండి ప్రకాష్ లొంగుబాటు ప్రచారం సికాస భవిష్యత్తు పై చర్చకు దారితీసింది. బండి ప్రకాష్ లొంగుబాటు ప్రచారం ఇప్పటికే మీడియా విస్తృతంగా ప్రచారం సింగరేణిలో జోరందుకుంది. ఒకవేళ బండి ప్రకాష్ లొంగుబాటు నిజoదాల్చితే, అందరూ పోగా సికాస మిగిలినా ఏకైక పెద్దదిక్కును సికాస కోల్పోయినట్లే.. ఇది సికాస కు మరోసారి కోలుకోని తీవ్రమైన ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు.