calender_icon.png 3 August, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లకు బైపాస్ రోడ్డు మంజూరు చేయండి

31-07-2025 12:54:56 AM

- ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని కలిసిన ఎంపీ డీకే. అరుణ, ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి

మహబూబ్ నగర్ జూలై 30 (విజయ క్రాంతి) : జడ్చర్ల పట్టణం లోని ట్రాఫిక్ రద్దీని పరిగణలోకి తీసుకొని బైపాస్ రోడ్డును మంజూరు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ని కలిసిన ఎంపీ డీకే. అరుణ, ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణ పలు విషయాలను కేంద్రమంత్రి కి వివరించారు.

మహబూబ్ నగర్ గుండా వెళ్లే జాతీయ రహదారి 167 నుంచి జాతీయ రహదారి 44 ని కలుపుతూ.. తిరిగి 167 కు అనుసంధానం అయ్యేలా జడ్చర్ల చుట్టూ బై పాస్ రోడ్డు నిర్మించాలన్నారు. వాహనాల రద్దీ నేప థ్యంలో జడ్చర్ల, పట్టణ ప్రజల ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ డీకే. అరుణ తెలిపారు.బైపాస్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఆవశ్యకతను పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.