31-07-2025 12:53:51 AM
మహబూబాబాద్, జూలై 30 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం చెరువు వద్ద స్మశాన వాటికను వెంటనే నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఐ కార్యదర్శి పెరుగు కుమార్, 27వ వార్డు కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నిజం చెరువు వద్ద శ్మశాన వాటిక నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ 30 లక్షల రూపాయలు మంజూరు చేశామని, శంకుస్థాపన కూడా చేసి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు.
శ్మశాన వాటిక నిర్మాణం కోసం కేటాయించిన 10 గుంటల భూమి అన్యాక్రాంతం అవుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిజం చెరువు వద్ద కేటాయించిన స్థలంలో శ్మశాన వాటిక నిర్మించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.