05-07-2025 12:00:00 AM
వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ భూమాత కృష్ణమూర్తి..
కొత్తూరు మనోజ్ జ్ఞాపకార్థం పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత..
వైరా, జులై 4 (విజయ క్రాంతి )మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య గొప్ప ఆర్థికవేత్త అని రాజకీయ నిపుణులని వైరా వర్తక సంఘం అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ భూమాత పెరుమాళ్ళ కృష్ణమూర్తి కొనియాడారు. స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవై శ్య మండల సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రోశయ్య 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు వైరా వర్తక సంఘం అ ధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు డాక్టర్ పెరుమాళ్ళ భూమాత కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ రోశయ్య బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఏ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టలేదని, అసెంబ్లీ సమావేశాల్లో బ డ్జెట్ కు సంబంధించి ఒక్క రూపాయి లెక్క తప్పకుండా ఏ రంగానికి ఎంత చొప్పున బడ్జెట్ను కే టాయించాం అనే విషయాలపై సంక్షిప్తంగా చెప్పగలిగిన ఏకైక గొప్ప ఆర్థికవేత్త రోశయ్యని కొనియాడారు.
అనంతరం...కొత్తూరి వెంకటరమణ కుమారుడు కొత్తూరు మనోజ్ జ్ఞాపకార్థం ని రుపేద ముగ్గురు కుటుంబాలకి చెందిన మహిళలకు కుట్టు మిషను మరియు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రథమ ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావు, మిట్టపల్లి సత్యంబాబు, మిట్టపల్లి వెం కటరమణ, మిట్టపల్లి నాగేశ్వరరావు, నూకల ప్రసాద రావు, కొమిరిశెట్టి శ్రీధర్, నాళ్ల గంగాధర్, వెంకట సుబ్బారావు, కొత్తూరు వెంకటరమణ, దొడ్డ సుధాకర్, గజ్జల కృష్ణమూర్తి, నంబూరి వెంకటేశ్వర్లు వజనేపల్లి చక్రధరరావు , కాటేపల్లి ఉపేందర్, రాయల జగదీష్, గ్రంధి విశ్వేశ్వరరావు, పెనుగొండ రామారావు, రంగా సింహాద్రి, అనుమోలు భాస్కరరావు, పట్టణ అధ్యక్షుడు ధారా వెంకటకృష్ణ, కొల్లా వెంకట రాంబాబు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.