01-08-2025 12:09:53 AM
రైల్వేలకు ఊతమిచ్చిన క్యాబినెట్
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం బడ్జెట్ పెంపు
వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, జూలై 31: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం సమావేశ మయిన కేంద్ర క్యాబినెట్ ఆరు కీలకనిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. ఆర్థిక వ్యవహా రాల క్యాబినెట్ కమిటీ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
2025 26 ఆర్థిక సంవత్సరం నుంచి 2028 ఆర్థిక సంవత్సరం వరకు నాలుగేళ్ల కాలానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు (ఎన్‌సీడీసీ)కి ఏడాదికి రూ. 500 కోట్ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్‌సీడీసీ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లు సేకరిస్తుందని, ఈ నిధులను కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల విస్తరణ, సహ కార సంస్థలకు రుణాలివ్వడం మొదలైన వాటికి ఉపయోగించనున్నట్టు తెలిపారు.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 13,288 సహకార సంఘాల్లోని 2.9 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. పీఎం కిసాన్ సంపద యోజన పథకానికి కేటాయింపులను పెంచారు. రూ. 1,920 కో ట్లుగా ఉన్న కేటాయింపులను రూ. 6,520 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
రైల్వేలకు ఊతమిచ్చిన క్యాబినెట్
ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రైల్వే రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుంది. 6 రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నాలుగు కీలక ప్రా జెక్టులకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయంతో ఈ జిల్లాల్లో రైల్వే నెట్‌వర్క్ 574 కిలోమీటర్ల మేర పెరగనుంది. రూ. 5,451 కోట్ల వ్యయంతో ఇటార్సి నాలు గో లైన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రూ. 2,179 కోట్ల నిధులతో నిర్మించతలపెట్టిన ఔరంగాబాద్(చత్రపతిశంభాజీ నగర్) పర్భానీ డబ్లింగ్ పనులకూ, రూ. 1,786 కోట్ల వ్యయంతో నిర్మించబోయే అలుబారి రోడ్ జల్పైగురి మధ్య మూడు, నాలు గో లైన్ పనులకూ, అలాగే దాంగోపోసి మధ్య మూడవ, నాల్గవ లైన్ పనులకు కూడా క్యాబినెట్ ఆమోదం లభించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజె క్టులతో రైల్వే రంగం మరింత అభివృద్ధి చెందనుంది.