01-08-2025 12:12:57 AM
బెంగళూరు, జూలై 31: కర్ణాటకలోని ప్రముఖ ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రం ‘ధర్మస్థల’ మరణాల మిస్టరీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు కేసులో తొలి ఆధారం లభించింది. తవ్వకాల్లో భా గంగా శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఆరో పాయింట్ వద్ద మానవ అస్థిపం జర అవశేషాలను గుర్తించారు.
ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడంతో కేసు దర్యాప్తులో ఉత్కంఠ పెరిగినట్టయింది. అస్థిపంజరం ఆనవాళ్లు చూ స్తుంటే అది ఒక పరుషుడివి అయి ఉండవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. అవశే షాలను ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యా చ్‌కు పంపించింది. ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత వాటి వివరాలు బయటికి రానున్నాయి.
శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాం తంలో రెండు దశాబ్దాల్లో అనేక మంది మహిళలు, యువతుల శవాలను పూడ్చి పెట్టినట్టు ఒక మాజీ పారిశ్యుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. దీంతో ధర్మస్థల సాముహిక ఖనన కేసు దర్యాప్తును సిట్ ప్రారంభించింది. ఇప్పటికే మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అను మానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు మొదలుపెట్టిన సిట్ అధికారులు అతడిని వెంట తీసు కెళ్లి నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టనట్టుగా మొత్తం 13 చోట్లను అతడు గుర్తిం చగా.. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
కాగా బుధవారం వరకు ఐదు ప్రదే శాల్లో మాన అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. తాజాగా ఆరో పాయింట్ వద్ద మృతదేహం అవశేషాలు బయటపడడంతో కేసులో కీలక పురోగతి లభించి నట్టయింది.
ఏమీటి ధర్మస్థల మిస్టరీ?
దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవక్షేత్రం. గతంలో అక్కడ పనిచేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అ దృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్టు అనుమా నాలు ఉన్నట్టు పేర్కొనడం సంచలనం కలిగించింది.
మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలపై పారి శుద్ధ్య కార్మికుడి నుంచి సిట్ అదికారులు వివరాలు అడిగి తెలుసుకుం టున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.