03-05-2025 12:00:00 AM
ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ
నిరుపేదల నిరీక్షణకు తెర
సంగారెడ్డి జిల్లాలో 1.20 దరఖాస్తులు
సంగారెడ్డి, మే 2(విజయక్రాంతి :అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీపై ఎట్టకేలకు దృష్టి సారించింది. అలాగే ప్రస్తుతం ఉన్న కార్డుల్లోనూ మార్పులు, చేర్పులకు సైతం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది.
అందుకు అనుగుణంగా రంగం లోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపుకు శ్రీకా రం చుట్టింది. దరఖాస్తుదారుల కుటుంబ సభ్యలు వివరాలతో పాటు వారి సమగ్ర సమాచారం సేకరిస్తూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే వారికి కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశముంది. కాగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి న గ్రామాల్లో ఇప్పటికే రేషన్ కార్డుల్లో చేర్చారు. వారికి బియ్యం కూడా కేటాయించారు.
జిల్లాలో 1.20 లక్షల దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కోసం ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వా రా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల వరకు దరఖాస్తులు రాగా వీటిలో ఎక్కువ శాతం దరఖాస్తు చేసిన వారే మళ్ళీ దరఖాస్తు చేశారు.
వీటన్నింటిని స్క్రూటినీ చేయగా 1.20 లక్షల వరకు దరఖాస్తులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో 50వేల దరఖాస్తులను పరిశీ లించి అప్డేట్ చేయడమే కాకుండా రేషన్ బియ్యం కూడా సరఫరా జరుగుతుంది. అంతేగాకుండా మార్పులు చేర్పులకు కూడా అవకాశం రావడంతో చాలా దరఖాస్తులు వచ్చాయి.
క్షేత్రస్థాయి విచారణ షురూ..
ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం అందిన దరఖాస్తుల్లో అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన కార్డుల జారీ, మార్పులు, చేర్పులకు గ్రీన్ సి గ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం దానిపై దృష్టి సారించారు.
మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి విచారణ చేపడుతున్నారు. అర్హులను గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతి కలిగిన భూమి అయితే 3 ఎకరాలు, సాగునీటి వసతి లేనటువంటి ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు.
సర్వేలో సాంకేతిక సమస్యలు...
సర్వేకు వెళ్ళిన రెవెన్యూ ఉద్యోగులకు అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన సమయంలో ఆధార్ కార్డు నంబర్కు బదులుగా ఇతరత్రా నంబర్లను నమోదు చేశారు. దీంతో యాప్లో ఆధార్ కార్డును నమోదు చేస్తే నమోదు కావడం లేదు. కొంతమంది రేషన్ కార్డుల్లో తమ పేర్లను తొలగించుకోవడంతో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేశారు. వారి వివరాలు సైతం యాప్లో అప్లోడ్ కావడం లేదు.
త్వరలో పూర్తి చేస్తాం..
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇస్తే కార్డులు ఇవ్వకపోగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనర్హులు స్వచ్ఛందంగా వారి కార్డులను అధికారులకు సరెండర్ చేయాలి. ప్రతినెలా 15-20 వేల కార్డులను పరిశీలించి నమోదు చేస్తున్నాం. త్వరలోనే పూర్తిస్థాయిలో రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేస్తాం.
వనజాత, డీసీఎస్‌ఓ, సంగారెడ్డి