calender_icon.png 4 May, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

03-05-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్ చెరు, మే 2 :కాలనీల అభివృద్ధిలో ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు ప్ర భుత్వానికి తోడ్పాటు అందించడంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొని రావాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శాం తినగర్ శ్రీ నగర్ జంట కాలనీల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం నూత న భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు కాలుష్యానికి చిరునామాగా నిలిచిన  పటాన్ చెరు  పట్ట ణం నేడు  శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని తెలిపారు.  ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు  కార్పొరేటర్  మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, నర్రా బిక్షపతి, కాలనీ అధ్యక్షులు అంజిరెడ్డి, తదితరులుపాల్గొన్నారు.