calender_icon.png 5 September, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ తెప్ప నిర్మాణానికి భూమి పూజ

05-09-2025 05:45:25 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్ అండ్ కాలనీలో బతుకమ్మ తెప్ప నిర్మాణానికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, యువకులు మహిళలు , గ్రామ ప్రజలు భూమి పూజ నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రతిపాదనల మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బతుకమ్మ తెప్ప నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. గతంలోనే ఆర్ అండ్ ఆర్ కాలనీలో బతుకమ్మ తెప్ప నిర్మాణానికి నూతనంగా నిర్మిస్తున్న ఆలయ సమీపంలో 24 గుంటల స్థలాన్ని కేటాయించారు. రాబోయే బతుకమ్మ పండుగ నాటికి మహిళలకు బతుకమ్మ తెప్ప అందుబాటులోకి తీసుక రానున్నట్లు నాయకులు తెలిపారు.