05-09-2025 05:49:40 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల ఒకరోజు శాంతియుతంగా రేషన్ లు బందు కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు ఎర్ర నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ రెండు కలిపి ఐదు నెలల కమిషన్ ఒకేసారి డీలర్ల ఖాతాలో జామచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని 17200 రేషన్ షాప్ లు రెండు ప్రభుత్వాలను వేడుకొంటున్నామని కోరారు.
దయ చేసి పాత పద్దతి లోనే మా రేషన్ డీలర్లకు ఒకే సారి కమిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రూ.5000 గౌరవ వేతనము క్వింటాల్కు రూ.300 కమిషన్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడిచిన కూడా ఇంతవరకు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే తేదీ 05.09.2025 ఈ రోజు సమ్మె చేస్తామని చెప్పారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేషన్ డీలర్ల సమస్యలను డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల అందరం కోరు తున్నామని చెప్పారు.