calender_icon.png 5 September, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

05-09-2025 08:04:23 PM

మంగపేట,(విజయక్రాంతి): మండలంలోని మల్లూరు గ్రామంలోని మెట్టు కాలనీవాసులకు గత వారం రోజులుగా (నల్లాలు) త్రాగునీరు రావడం లేదని శుక్రవారం గ్రామపంచాయతీ ఎదుట నిరసనకు దిగారు.  త్రాగడానికి నీళ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నామని కాలనీవాసులు ఎన్నిమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. సహనం కోల్పోయిన మహిళలు ఖాళీ బిందెలతో మల్లూరు గ్రామపంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ తక్షణమే మాకు నీళ్లు రావాలని నినాదాలు చేశారు.