05-09-2025 07:57:59 PM
మరిపెడ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ మాకుల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ విజయ నందన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ గౌడ్, ఎస్సై బోలగాని సతీష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్, రవికాంత్, మున్సిపల్ సిబ్బంది ,గణేష్ భక్తులు ఉన్నారు