calender_icon.png 5 September, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి..

05-09-2025 08:00:20 PM

బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన 70 మంది బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు...

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

బాన్సువాడ (విజయక్రాంతి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 70 మంది మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాన్సువాడ నియోజకవర్గం లో బీఆర్ఎస్  పార్టీకి పూర్వ వైభవం రానుందన్నారు. 

ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ సిందే. ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు నల్లమడుగు సురేందర్. బాన్స్ వాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్. అంజిరెడ్డి. ఎర్రవట్టి సాయిబాబా. బోడ చందర్. మొచ్చి గణేష్. రమేష్ యాదవ్. గాండ్ల కృష్ణ. మొగులన్న. శివ సూరి. తదితరులు ఉన్నారు.