calender_icon.png 5 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరి సిద్ధి వినాయక శోభాయాత్రలో మాజీ కార్పొరేటర్ శేషా కుమారి పాల్గొనడం విశేషం

05-09-2025 05:41:28 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): బాల్కంపేట్ లోని పరిసర ప్రాంతం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన సిరి సిద్ధి వినాయక శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు.శోభాయాత్ర విజయవంతం కావడానికి కమిటీ సభ్యులు కళ్యాణ్, మల్లికార్జున్, అరుణ్, కార్తీక్, సతీష్ విశేష కృషి చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మహిళా నాయకులు కూతురు నరసింహ, బలరాం, లక్ష్మి భాష, నాగలక్ష్మి, దుర్గా, రాణి కౌర్ పాల్గొని శోభాయాత్రకు మరింత భక్తి వైభవం జోడించారు.శోభాయాత్రలో వినాయక భజనలు, డప్పు వాయిద్యాలు, హారతి దృశ్యాలు భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపు మార్గమంతా భక్తులు గణనాథుడి నామస్మరణ చేస్తూ పూలతో, పండ్లతో స్వాగతం పలికారు.ఈ వేడుకను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కుటుంబ సభ్యులతో సహా స్థానికులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి ఆశీర్వాదాలతో ఇళ్లలో శాంతి, సంపదలు వెల్లివిరియాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శేషు కుమారి మాట్లాడుతూ... "గణనాథుడు విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను. సిరి సిద్ధి వినాయక శోభాయాత్రలో పాల్గొనడం నాకు ఆనందాన్నిచ్చింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయి" అని అన్నారు.