బావుసాయిపేటలో ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమిపూజ
కోనరావుపేట ఆగష్టు 17 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామానికి చెందిన జంగం బాబు పొలంలో ఫామ్ పాండ్ కాంపౌండ్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, పంచాయతీ కార్యదర్శి రాధిక, ఫీల్డ్ అసిస్టెంట్ నంధ్య తదితరులు పాల్గొన్నారు.
ఫామ్ పాండ్ ద్వారా చేపల పెంపకంతో పాటు చిన్నచిన్న తోటలను ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండించుకోవచ్చని తెలిపారు. వర్షాలు లేని సమయంలో ఫామ్ పాండ్‌లో నిల్వ ఉండే నీటిని వ్యవసాయ అవసరాలకు, తోటలకు వినియోగించుకోవచ్చన్నారు. ఫామ్ పాండ్ రైతులకు అదనపు ఆదాయం అందించడంతో పాటు నీటి సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా పేర్కొన్నారు.






