17 August, 2026 | 6:16 PM

నాగిరెడ్డిపేట్లో స్టడీ సెంటర్తో కూడిన నూతన గ్రంధాలను ఏర్పాటు చేయాలి

17-08-2026 05:16 PM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ప్రజావాణిలో నాగిరెడ్డిపేట్ మండలానికి స్టడీ సెంటర్తో కూడిన 300 నుండి 400 మంది కూర్చొని చదువుకునే విధంగా నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని మాల్తుమ్మెద గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు.

నాగిరెడ్డిపేట్ మండలంలో ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ కావాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. వారందరూ చదువుకోడానికి హైదరాబాదు ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.ఇందులో చాలామంది పేదలు మరియు మధ్య తరగతి నిరుద్యోగ వ్యక్తులు ఉన్నారు.

వీరికి ఆర్థిక భారం చాలా అవుతుంది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నాగిరెడ్డిపేట్ మండలంలో నూతన గ్రంథాలయం భవనాన్ని ఏర్పాటు చేయాలని మాల్తుమ్మెద గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, గ్రామస్తులు కర్రి సంతోష్, నాగరాజు ప్రజావాణిలో వినతి పత్రం రూపంలో విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాల్ తుమ్మెద గ్రామస్తులు కర్రె సంతోష్, నాగరాజు పాల్గొన్నారు.