calender_icon.png 12 May, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 500 ఎకరాల్లో మునగ సాగు

07-05-2025 01:12:42 AM

వ్యవసాయ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

అశ్వారావుపేట, మే 6, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో రైతులు 500 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్  అన్నారు. మంగళవారం కలెక్టర్ అశ్వరావుపేట  పట్టణం లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలను సందర్శించారు. కళాశాల ఆవరణంలోని ఇంకుడు గుంతలను పరిశీలించిన కలెక్టర్,  ఇంకుడు గుంతలపై విద్యార్థులకు మరి న్ని సూచనలు చేశారు.

కళాశాలలో యూనివర్సిటీ లు జరుగుతున్న మామిడి, మునగ పంటలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలోని 500 ఎకరాల్లో మునగ సాగు అవుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మునగ ఎగుమతి చేసే స్థాయికి రైతులు మునగ పంట సాగు చేసుకోవాలన్నారు.

రైతులకు ఎటువంటి అనుమానాలు ఉన్నా యూనివర్సిటీ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ప్రొఫెసర్లను సైంటిస్ట్ లను అడిగి  సందేహాలు నివృత్తి చేసుకొని పంటలు వేసుకోవాలన్నారు. వ్యవసాయ కళాశాలను సందర్శనకు ముందు మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోగులపూడి కొండ రెడ్లు తోను,  కన్నాయి గూడెం 152 సర్వే నెంబర్ రైతులతో మాట్లాడారు. కలెక్టర్ తో పాటు తహసీల్దార్ కృష్ణమురళి ఉన్నారు.