07-05-2025 01:11:38 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 06 ( విజయక్రాంతి ) : భూ సమస్య ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం గోపాలపేట మండలంలోని మున్ననూర్ తాడిపర్తి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ తనిఖీ చేశారు.
భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ శాఖను సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామాల్లో ప్రజలను అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. రెవెన్యూ సదస్సు నిర్వహించనున్న గ్రామంలో దరఖాస్తులను ఒకరోజు ముందుగానే పంచడం అదేవిధంగా టాంటాం చేయించడం వంటివి చేయాలన్నారు.భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ రోజు మండలంలోని మున్ననుర్ గ్రామంలో 35 దరఖాస్తులు, తాడిపర్తి గ్రామం నుండి 36 వెరసి ఈ రోజు 71 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలని, సక్సెషన్ కు సంబంధించి వెంటనే నోటీస్ లు జారీ చెయ్యాలని సూచించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, గోపాల్పేట తహాసిల్దార్ పాండు, తహసిల్దార్ రాజు, డి. సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, డిటి తిలక్ రెడ్డి ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు