calender_icon.png 11 May, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి

07-05-2025 01:13:57 AM

-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

 నారాయణపేట. మే 5(విజయక్రాంతి) : జిల్లాలో నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అ న్నారు. మంగళ వారం కలెక్టరేట్ లోని  కలెక్టర్ ఛాంబర్ లో నేషనల్ మిషన్ ఆన్  ఎడిబుల్ ఆయిల్స్  అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ మిషన్  ప్రధాన ఉద్దేశ్యం దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించ డం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్  మాట్లాడుతూ.... మద్దూరు, దామరగిద్ద, మక్తల్ మండలాల్లో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో సుమారు 1500 హెక్టార్లలో (పల్లీ) వేరుశెనగ సాగును  ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

ఈ ఉద్దేశంతో రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణా కార్యక్రమాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఫార్మర్ ఫీల్ స్కూల్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే మైక్రో ఇరిగేషన్ (స్ప్రింక్లర్లు) ఏ ర్పాటు కోసం ఉద్యానవన శాఖ సహకారం అవసరమని, అ లాగే  ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహా యం అందించేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మద్దతు ఇవ్వాలని జాన్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

ఆయా ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్  సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందించేందు కు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, ఇరిగేషన్ ఈ ఈ బ్రహ్మానందరెడ్డి, నారాయణపేట వ్యవసాయ అధికారులు, మద్దూ రు, దామరగిద్ద, మక్తల్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి,  ఎఫ్ పీ వో  ప్రతినిధులు పాల్గొన్నారు.