25-09-2025 01:21:42 AM
562 పోస్టులకు రిజల్ట్స్ ప్రకటించిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో 563 గ్రూప్ పోస్టు లకు గానూ 562 మందిని ఎంపిక చేస్తూ బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ఫలితాలు వెలువరిచింది. గ్రూప్ మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే విధించిన నేపథ్యంలో గంటల వ్యవధిలోనే టీజీపీఎస్సీ ఫలితాలు వెలువరించడం గమనార్హం.
తీర్పు అనంతరం ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అర్ధరాత్రి వరకు కసరత్తు చేసింది. టాప్ 5 ర్యాంకర్లు: 1. లక్ష్మీదీపిక, 2. దాడి వెంకటరమణ, 3. వంశీకృష్ణారెడ్డి, 4. జిన్నా తేజస్విని, 5. కృతిక