ఘనంగా జంపన ప్రతాప్ జన్మదిన వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రతాప్ నివాసంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. మడ్ఫోర్ట్, కాకగూడ, కంసారి బజార్, న్యూ బోయినపల్లి, సీతారామపురం, నేతాజీ నగర్ ప్రాంతాల్లో కేక్ కట్ చేశారు,
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బీ.ఎన్ శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్, రాజీవ్ రహదారి ప్రాపర్టీ జేఏసీ చైర్మన్ సతీష్, సిరాజ్, షకీబ్, చోటు, మౌలా, వెంకటాచారీ, ఓం ప్రకాష్ యాదవ్ తదితరులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్‌కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.






