calender_icon.png 23 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడ్డేలుగులా వెలిశాల రాజేందర్‌రావు

23-01-2026 12:51:19 AM

మాజీ మేయర్ సునీల్ రావు ధ్వజం

ముకరంపురా , జనవరి22(విజయక్రాంతి): కరీంనగర్ జనారణ్యంలోకి... గుడ్డేలుగులా వెలిశాల రాజేంధర్ రావు చొరబడ్డారని బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మండి పడ్డారు. కరీంనగర్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... కరీంనగర్ నగర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ నగరంలో వెలిశాల రాజేంధర్ రావు అనే ఎలుగు బంటి చొరబడ్డారని ఎద్దేవ చేశారు.

తెగ తిని.. ఎలుగుబంటి ఆకారంలో నగరంలో పర్యటిస్తున్నారని ద్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ లో కొంత మంది సీనియర్ నాయకులు పార్టీని వీడకుండ పది సంవత్సరాలు అపోజిషన్ లో పనిచేసిన నాయకులను అనగతొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాలను మొసం చేసి దొంగ కాంట్రాక్టులతో అక్రమంగా డబ్బుల కట్టలు ముటగట్టుకొని. వచ్చిన డబ్బులతో పదవులు కొనుక్కొని ఒక వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మరో వైపు ఇతర పార్టీల నాయకుల పై విష ప్రచారం చేస్తున్నారని ద్వజమెత్తారు.

రాజేంధర్ రావు మెడదు చిన్నగా ఉందని ఎద్దేవ చేశారు. ఏం మాట్లాడుతావో ఏం చేస్తావో తెలియని అయోమయ పరిస్థితి లో ఉన్నాడని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో సైతం... నీ పార్టీ నాయకులే నీ దుమ్మెత్తి పోస్తు.... తిట్ల పురాణం పెడుతున్న పరిస్తితి ఉందంటే మీ పార్టీలో నీ విలువేంటో అర్థమౌతుందని అన్నారు. మూడు నాలుగు సార్లు ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయినా రాజేంధర్ రావు పద్దతి మారలేదని ద్వజమెత్తారు. గత 35 సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో ఉండి... ప్రజల మద్య పని చేస్తూ.... రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నామని తెలిపారు.

నీలాగా అక్రమ కాంట్రాక్టుల ద్వారా ప్రభుత్వ సొమ్ము మింగి ఇతరుల కాంట్రాక్టుల పేరుతో దొంగ బిల్లులు తీస్కొని వచ్చిన వాళ్లము కాదని ద్వజమెత్తారు. ఐదు సార్లు ప్రజా క్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ వ్యక్తులమని అన్నారు. కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి వెనుక మాపాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల క్రితం కరీంనగర్ నగరం ఎలా ఉంది... గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కరీంనగర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రజల కల్లకు కనబడుతుందని తెలిపారు.

రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో మొత్తం 66 సీట్లల్లో 35కు పైగా సీట్లల్లో విజయం సాధించి, కరీంనగర్ నగరపాలక సంస్థపై బీజేపి జెండా ఎగురవేస్తమని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్, వెంకట్ రావు,నాగరాజు,శ్రీనివాస్,రాజప్రభాకర్,తదితరులు ఉన్నారు.