calender_icon.png 23 January, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తాం

23-01-2026 12:51:30 AM

కలెక్టర్ మను చౌదరి 

మేడ్చల్, జనవరి 22(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 2002 నుండి ఉన్న  ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాకు అనుగుణంగా సవరించే మ్యాపింగ్  ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే  సూపర్ వైజర్లను, బిఎల్ ఓలను సస్పెండ్ చేస్తామని  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. గురువారం మల్కాజిగిరి డిప్యూటి కమీషనర్ కార్యాలయంలో ఓటరు జాబిత అనుసంధాన ప్రక్రియ పురోగతి పై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలోనే మన జిల్లా చివరిస్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ద వహించి పురోగతి సాధించాలని సూపర్ వైజర్లను ఆదేశించారు.

తమ తమ బిఎల్‌ఒలతో సమావేశమై వారికి ప్రక్రియ పై  పూర్తి అవగాహాన కల్పించాల్సిన బాధ్యత సూపర్ వైజర్లదే అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ పై సింగిల్ నంబరు శాతం ఉండడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.  బిఎల్‌ఓలు వైద్య, వ్యక్తిగత కారణాల వల్ల హజరు కాని వారి స్థానంలో చురుకుగా పనిచేసే వారిని నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎఈఆర్‌ఓలు పూర్తి బాధ్యత తీసుకొని సూపర్ వైజర్లకు, బిఎల్‌ఓలకు రోజువారి లక్ష్యాలను ఇచ్చి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బిఎల్‌ఓలతో ఇంటింటికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  డిప్యూటి కమీషనర్ ఝకీరా సుల్తానా, మల్కాజిగిరి ఆర్డిఓ శ్యాంప్రకాష్, తహాసీల్దారు సీతారామ్, ఏఈఐఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.