calender_icon.png 3 August, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా గూడూరి సురేష్

02-08-2025 08:52:06 PM

కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్..

ముస్తాబాద్ (విజయక్రాంతి): కేటీఆర్ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా గన్నేరువరం మండలానికి చెందిన గూడూరు సురేష్ ను నియమించినట్లు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్(President Mengani Manohar) ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ సేన కమిటీ లను బలోపేతం చేసే ముఖ్య ఉద్దేశంతో అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్ని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో నెరవేర్చే వరకు ప్రజా క్షేత్రంలో ముందుండాలని కేటీఆర్ సేన కమిటీలకు పిలుపునిచ్చారు. తదుపరి సురేష్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.