10-12-2024 12:00:00 AM
సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు 12వ గేమ్‌లో ఓటమి ఎదురైంది. 11వ గేమ్‌లో విజయం సాధించిన గుకేశ్ సోమవారం నాటి గేమ్‌లో మాత్రం చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ చేతిలో 39 ఎత్తుల వద్ద పరాజయం చవిచూశాడు. ఏడు వరుస డ్రాల తర్వాత మళ్లీ రెండు గేముల్లో చెరొకటి విజయం సాధించారు.
12వ గేమ్‌లో గుకేశ్ నల్ల పావులతో బరిలోకి దిగాడు. ప్రస్తుతం గుకేశ్, లిరెన్ చెరో 6 పాయింట్లతో ఉన్నారు. టైటిల్ అందుకునేందుకు ఇద్దరికి 1.5 పాయింట్లు అవసరం కాగా.. మరో 2 గేములు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన రెండు గేములు డ్రా అయితే టై బ్రేకర్ నిర్వహించనున్నారు. ఇద్దరిలో అతి తక్కువ ఎత్తుల్లో ఎవరు టై బ్రేకర్ గెలిస్తే వారికి టైటిల్ అందించనున్నారు.