calender_icon.png 13 September, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్ ఫామ్‌పై ఆందోళన వద్దు

10-12-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని మాజీ ఆటగాడు కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో మిడిలార్డర్‌లో వచ్చిన రోహి త్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఆట పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కపిల్ హిట్‌మ్యాన్‌కు అండగా నిలిచాడు.

‘రోహిత్ కొత్తగా నిరూపించు కోవడానికి ఏం లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితి గతంలోనూ చూశాడు. మూడో టెస్టులో రోహిత్ రాణించాలని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ విషయంలో కపిల్ విచారం వ్యక్తం చేశా రు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంబ్లీకి అండగా నిలవాల్సిన అవసరముంది. అతడు తొందరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని తెలిపాడు.