09-12-2024 11:58:32 PM
డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్
గెబెర్హా: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా జట్టు 2 క్లీన్‌స్వీప్ చేసింది. లంకతో జరిగిన రెండో టెస్టు లో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 347 పరుగుల భారీ టార్గెట్‌తో చివరి రోజు బరిలోకి దిగిన శ్రీలంక 238 పరుగులకే పరిమితమైంది. ధనుంజయ డిసిల్వా (50), కుశాల్ మెండిస్ (46) మెరిసినప్పటికీ జట్టును గెలిపించడం లో విఫలమయ్యారు.
సఫారీ బౌలర్లలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 5 వికెట్లతో చెలరేగగా.. రబాడ, పీటర్సన్ చెరో 2 వికెట్లు తీశా రు. 2020 డిసెంబర్ నుంచి సౌతాఫ్రికాకు 13 టెస్టుల్లో ఇది 11వ విజయం కావడం విశేషం. లంకపై సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2025) పట్టికలో సౌతాఫ్రికా నంబర్‌వన్ స్థానానికి దూసుకొచ్చింది.
10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 63.33 పర్సంటైల్ పాయింట్స్‌తో సఫారీలు తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలి యా (60.71), టీమిండియా (57.29)తో రెండూ, మూడు స్థానాల్లో కొనసాగుతున్నా యి. సౌతాఫ్రికా మరొక విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు కానుంది.