7 August, 2026 | 9:32 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

23-08-2024 11:54 AM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. జైనథ్ మండలం బాలాపూర్ కు చెందిన భూమన్న (40) ఎలక్ట్రిషన్ వృత్తి చేసుకుంటూ ఆదిలాబాద్ లోని మాహాలక్ష్మి వాడలో నివసిస్తున్నారు. తమ స్వగ్రామం బాలపూర్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జైనథ్ మండలంలోని బోరజ్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మ్యాక్స్ వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.