30-08-2025 02:57:21 PM
మఠంపల్లి: విశ్వ సాహితీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేత కళా ప్రపూర్ణ నట శ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్యను తెలుగు సాహితీ కళ వేదిక జాతీయ చైర్మన్ కొల్లి రమావతి నియమించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్ పర్సన్ కొల్లి రమావతి మాట్లాడుతూ, ఒక ఆశయంతో సాహిత్య అభిలాషతో నిరంతరం సాహిత్య సాంస్కృతిక సమాజసేవలో నిరంతర కార్యక్రమాలు చేయాలనే తలంపుతో మఠంపల్లి మండల కేంద్రమునకు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేత కళా ప్రపూర్ణ నటశ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్యకు తెలంగాణ రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులుగా విశ్వ సాహితీ కళావేదిక నాటక అకాడమీ అధ్యక్ష పదవిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కళారంగా విశిష్ట సేవలను గుర్తించి నియమించినట్లు తెలిపారు.
వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అనేక పరిషత్తులలో కళా ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది ప్రేక్షకుల మన్నలను పొంది విశ్వ సాహితి కళావేదిక నట శ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రతిభ పాటవాలను గుర్తించి అభినందించి తెలంగాణ రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులుగా నియమించడం ఆయన ప్రతిభా పాట వాళ్లకు నిలువెత్తు నిదర్శనమని పలువురు స్వచ్ఛంద సంస్థ, అమృత శ్రీ వర్షిని సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు స్వర శ్రీ డాక్టర్ పి.కొండలరావు, లక్ష్మీ గణపతి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షురాలు వేముల పద్మావతి, పరసపరిమల ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ పరస పరిమళ పలువురు కళాకారులు రాజకీయవేత్తలు అభిమానులు సన్నిహితులు ఈ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.