calender_icon.png 31 August, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్షం రోజుల్లో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రైతులను ఆదుకోవాలి

30-08-2025 09:46:17 PM

అకాల వర్షానికి అన్నదాతలు ఆగం 

రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు 

మంజీరా నది పరివాహక ప్రాంతంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది 

నష్టపోయిన రైతుల పట్ల నాయకులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు

నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం 

మంజీరా నది పరవాక ప్రాంత రైతులకు తీరని నష్టం

పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే 

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వరదలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బొగ్గు గుడిస వెల్లుట్ల వెంకటాపూర్ కళ్యాణి తిమ్మారెడ్డి తిమ్మాపూర్ నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు వెంకంపల్లి నాగిరెడ్డిపేట చినూర్ గోలింగాల పోచారం పలు గ్రామాలకు చెందిన రైతులకు పంట నష్టం తీవ్రంగా జరిగిందని ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ను సమకూర్చి నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు.

అనంతరం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ, వర్షాకాలం ఉన్నప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులు నీటిని పూర్తి లెవెల్ ప్రాజెక్టును ముందుగానే నిప్పి పెట్టారని దాని ద్వారా ఎటువంటి భారీ వరద మాంజీరా నది పరివాహక ప్రాంత వాసులకు నష్టం వాటిల్లిందని దానికి నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులే కారణమని మండిపడ్డారు. అనంతరం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ కళ్యాణి ప్రాజెక్టు వద్ద అధికారులు సక్రమంగా సమయానికి గేట్లు ఎత్తకపోవడం వల్ల ప్రాజెక్టు పక్కనుండి భారీ వరద వచ్చి గెట్ టు కొట్టుకపోవడంతో ఆ వరద ద్వారా బొగ్గు గుడిసే ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు నష్టపోయారని ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని నష్టపోయిన ప్రజలకు పక్షం రోజుల్లోనే ఆర్థిక సహాయం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నష్టపోయిన రైతులు తదితరులు పాల్గొన్నారు.