calender_icon.png 31 August, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయానికి కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడం, బొగ్గు గుడిసె కొట్టుకుపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం...

30-08-2025 09:38:21 PM

అకాల వర్షానికి అన్నదాతలు ఆగం మాగం 

కుండపోత వర్షం కూలిపోయిన ఇండ్లు కొట్టుకుపోయిన చెరువు కుంటలు, 

వరద ప్రవాహానికి ఓర్రెలు పడ్డ రైతుల పొలాలు 

ప్రత్యేక ప్యాకేజీ పెట్టి రైతులను నష్టపోయిన ప్రజలను ప్రభుత్వమే కాపాడాలి 

జహీరాబాద్ పార్లమెంటు మాజీ ఎంపీ బీబీ పాటిల్ 

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): గత మూడు రోజుల క్రితం కుంభవృష్టిగా కురిసిన వర్షానికి అన్నదాతలు రైతులు వ్యాపారులు రోడ్లు కుంటలు చెరువులు జలదిగ్బంధమై, ఎంతోమంది ప్రజలకు తీరని నష్టం వాటిలిందని రాష్ట్ర బిజెపి నాయకులు జహీరాబాద్, పార్లమెంటు మాజీ ఎంపీ బీబీ పాటిల్(Former MP BB Patil) అన్నారు. శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బొగ్గు గుడిసే ప్రాంతంలో భారీ వరదకు కొన్ని దుకాణ సముదాయాలు, ఇండ్లు కొట్టుకపోవటంతో ఆయన ప్రత్యక్షంగా చూసి నష్టపోయిన ఆ ప్రజల పట్ల తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. అనంతరం బొగ్గు గుడిసే వద్ద జరిగిన వరద ప్రభావానికి ముఖ్య కారణం కళ్యాణి ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులు లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడం ద్వారా నీరు అధికంగా వరద ప్రవహించి కట్ట తెగిపోవడంతో ఆ నీరంతా బొగ్గు గుడిసె వైపు వెనుతిరిగి చాలామంది ప్రజలకు తీరని అన్యాయం చేకూర్చిందని కళ్యాణి ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. సంబంధిత శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

బొగ్గు గుడిసె, అన్నా సాగర్ గ్రామాలకు సంబంధించిన వ్యాపారస్తులు తమ షాపులు పూర్తిగా ధ్వంసం అయిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసం కావడంతో దాన్ని నేరుగా పరిశీలించారు. అనంతరం వెంకటాపూర్ ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో అక్కడ వెళ్లి ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ తో తక్షణమే వారికి ప్రయాణానికి అనుకూలంగా మార్గం చేయాలని కోరారు. ఎల్లారెడ్డి పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కూలిన కటికే హుస్సేన్ ఇల్లును పరిశీలించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామంలో చెరువు పూర్తిగా తెగిపోవడంతో చెరువు కట్టని పరిశీలించి గ్రామస్తులకు మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ  బిజెపి మండల అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు గంగాధర్, ప్యాలల రాములు, నరేష్ పికె, ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్, మహేందర్, అశోక్ ఉపాధ్యక్షులు జనముల పోచయ్య, సాయి రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి గౌడ్, రాములు, వివిధ గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.