calender_icon.png 31 August, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు

30-08-2025 09:47:10 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఒక మహిళ మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ దర్యాప్తు ఆధారంగా మహిళను హత్య చేసిన వ్యక్తిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ  తెలిపిన వివరాల ప్రకారం అంబటిపల్లి గ్రామానికి చెందిన వోల్లాల భాగ్యలక్ష్మి( 51) అను మహిళా డిసెంబర్ 27, 2024 నుండి కనపడకుండా పోయిందని ఆమె కుమారుడు వోల్లాల రవికుమార్  మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అప్పటినుండి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ ఫోన్, సిగ్నల్స్, కాల్ డేటా, గ్రామంలోని సిసి కెమెరాలు పరిశీలించి అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న, వెన్నపు రెడ్డి (రామయ్య) అలియాస్ రామ్ రెడ్డి అనే అతడిని పట్టుకొని విచారించగా భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ వద్ద డబ్బులు ఉన్నావని డబ్బుల కొరకు ఆమహిళా ను నమ్మబలికి భూపాలపల్లి దగ్గరలో గల కమలాపూర్ ఎక్స్ రోడ్డు అడవిలో కొద్ది దూరం తీసుకెళ్లి హత్య చేసి ఏ ఆధారం లేకుండా మహిళ యొక్క శవాన్ని పెట్రోలు పోసి కాల్చి ఏ ఆధారం లేకుండా చేసి తిరుగుతున్నాడు, అతడిని పట్టుకొని విచారించి ఈరోజు రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.