calender_icon.png 31 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డేపల్లి చర్చి సర్కిల్లో బార్ షాపు అనుమతి రద్దు చేయాలి

30-08-2025 09:44:11 PM

వడ్డేపల్లి (విజయక్రాంతి): హనుమకొండలోని వడ్డేపల్లి చర్చి సర్కిల్లో ఏర్పాటు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని జై భీమ్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ కుమార్, వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి రవీందర్ (జెకె) లు డిమాండ్ చేశారు. హనుమకొండ వడ్డేపల్లి చర్చి సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ భవనం ముందు జై భీమ్, వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వడ్డేపల్లి చర్చి జంక్షన్ లో బార్ అండ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తే శాంతిభద్రతకు విఘాతం కలుగుతుందని అన్నారు.

చర్చి జంక్షన్ తో 5 చర్చిలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పిజి కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా వడ్డేపల్లిలో మహిళా పీజీ కాలేజీ తో పాటు బాలికల జూనియర్ కళాశాల ఉందని ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఆకతాయిలు, మద్యం బాబులు వేధించే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు బార్ షాప్ అనుమతిపై పున పరిశీలన చేసి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజ్, వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు ప్రసంగి, సుదర్శన్, పీటర్, ప్రభాకర్, భాస్కర్,పిలిఫ్స్, చార్లెస్, కుమార్, రాజు లతో పాటు బిజెపి డివిజన్ అధ్యక్షుడు నల్ల రమేష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.