calender_icon.png 31 August, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

30-08-2025 09:41:20 PM

చివ్వెంల: ఎనుబముల గ్రామంకు చెందిన కలకోట్ల శ్రీను తండ్రి రాములు  సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సూర్యాపేట నుండి ఏనుబాములకు  తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈరోజు మద్యహ్నం 1గంట సమయం లో బీబిగూడెం వద్దకు వచ్చేసరికి ఎదురుగా డీసీఎం డ్రైవర్ అతివేగంగా అజగ్రత్తగా నడుపుకుంటు వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని  టక్కర్ ఇచ్చాడు. అతనికి తలకు బలమైన గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స  పొందుచు మరణించాడు. అతని కొడుకు రాకేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.మహేశ్వర్  కేసు నమోదు చేశారు.