30-08-2025 09:40:38 PM
భారీ వరదలతో అతల కుతలమైన పోచారం ప్రాజెక్టు
కొట్టుకపోయిన చెరువులు తెగిపోయిన కుంటలు ధ్వంసమైన ప్రధాన రహదారులు వంతెనలు
నియోజకవర్గమంతా అతలాకుతలం
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి సార్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ వినతి
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): అతి భారీగా కురిసిన వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి లింగంపేట నాగిరెడ్డిపేట రాజంపేట మండలాల్లో చెరువులు కుంటలు నాగిరెడ్డి పేట మండలంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు జీవనాధారం అయినటువంటి పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాజెక్టు అతి భారీ వరదకు ప్రాజెక్టు అంచు బాగాన స్వల్పంగా డామేజ్ కావడంతో ప్రాజెక్టు దిగనున్న ప్రజలకు ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన రహదారులు వంతెనలు చెరువులు ఎక్కడికక్కడ జలదిగ్బంధమై ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడే తెగిపోయినట్లు వాటన్నిటిని పరమత్తులు చేయడానికి, మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు నష్టపరిహారం, ఎల్లారెడ్డి మండలంలోని జరిగిన వాటి పలు సంఘటనలకు ప్రజలకు ప్రభుత్వం తరఫున మేలు చేయడానికి ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్(Yellareddy MLA Madan Mohan) ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఆదుకోవాలని అన్నారు.
నియోజకవర్గంలో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ధ్వంసమైన గృహాలకు ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ద్వారా నూతన గృహాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కోరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గ పట్ల జరిగిన భారీ నష్టానికి వినతిని స్వీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం వరదల వల్ల ఎదురైన పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందిస్తుందని, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు మరియు వరదల పరిస్థితుల్లో ఎల్లారెడ్డి ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అధికారులు మరియు సహాయ బృందాలతో సమన్వయం కొనసాగించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వరదల్లో ఇరుక్కున్న ప్రజలను సురక్షితంగా బయటకు రప్పించడంలో ఆయన పాత్ర కీలకమైందని సీఎం పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలతోపాటు నిలిచిన ప్రభుత్వ అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం అభినందించినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు.