calender_icon.png 31 August, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాయిగూడెం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల అమలులో అవకతవకలు

30-08-2025 09:44:44 PM

అర్హులైన నిజమైన పేదలకు ఇళ్లు అందలేదు

అధికార పార్టీ నాయకుల అండదండలతో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రారంభించిన ఈ పథకంలో, ఇప్పటికే ఇతర ప్రభుత్వ ఫలాలు పొందిన కొందరికి మరియు సిమెంట్ తో కట్టిన ఇల్లు ఉండీ నాలుగు చక్రాల వాహనాలు ఉంటే ఇవ్వడం లేదన్నారు మరి ఇప్పుడు ఎలా ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఇండ్లు కేటాయించడంతో ఇళ్ళు ఉన్నవారికి ఇచ్చి లేనివారిని గాలికి వదిలేశారని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిజమైన పేదలకు ఇళ్లు అందకపోవడం ఏంటో...? అర్హులు కాకపోయిన కొంతమందికి అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇండ్లు కేటాయించారని స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం స్పష్టంగా "నిరుపేద కుటుంబాలకు ఇండ్లు వర్తించాలి" అని ఆదేశిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నేతల ప్రభావంలో కొన్ని కేటాయింపులు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. "మండలంలో ఇందిరమ్మ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సభ్యులు ఎవరు? ఎంపిక ఏ ఆధారంగా జరిగింది?" అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అనర్హులైన వారిని వెంటనే తొలగించి, నిజమైన అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కేటాయించాలని వారు ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.