30-08-2025 09:38:03 PM
4 మండలాలలో 10 మందిపై కేసులు నమోదు
41 లీటర్ల గుడుంబా స్వాధీనం : ఏఎస్పీ వెల్లడి
అదిలాబాద్,(విజయక్రాంతి): ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా పటిష్టమైన పోలీసు చర్యలను చేపడుతున్నట్లు ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఆదేశాల మేరకు ఉట్నూర్ డివిజన్ లోని 4 మండలాలలో ఏకకాలంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 బృందాలుగా ఏర్పడిన సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు గుడుంబా కేంద్రాలపై దాడులు చేయగా, నాలుగు మండలాలలో వివిధ గ్రామాలకు చెందిన పది మంది పై కేసులు నమోదు చేసినట్లు వారి వద్ద నుండి దాదాపు 41 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. గుడిహత్నూర్ మండలంలో రాథోడ్ రమేష్, రాథోడ్ రోహిదాస్, రాథోడ్ కృష్ణ ఆడే లక్ష్మి, సిరికొండ మండలంలో రాథోడ్ శేషారావు, వాగ్మారా చంద్రకాంత్, చౌహన్ రామకృష్ణ, నార్నూర్ మండలం లో రాథోడ్ సకారం, రాథోడ్ శ్రీనివాస్, నేరేడిగొండ మండలంలో జాదవ్ సానుబాయి లను అరెస్టు చేశారు.