calender_icon.png 11 July, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

11-07-2025 01:00:52 AM

పూజలు చేసిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్/మేడిపల్లి/కుత్బుల్లాపూర్, జులై 10 (విజయక్రాంతి) : ఎల్బీనగర్ నియోజకవర్గంలో గురువారం గురుపౌర్ణమి వేడు కలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. దిల్‌షుక్‌నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శ్రద్ధా  సబూరీ సిద్ధాంతాన్ని ప్రతిఫలించేలా, ఆలయంలో ఆధ్యాత్మి కత వాతావరణం ఏర్పడింది.

భక్తు ల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. అన్నదానం, పవిత్ర రుద్రాభిషేకాలు, గురుపూజలు వంటి కార్యక్రమా లు కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్ ఎమ్మె ల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ప్రముఖులు సాయిబాబా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నా రు. గురు పౌర్ణమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొ రేషన్ పరిధిలోనీ వివిధ ప్రాంతాలలో సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ  బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఆయనవెంట నిజాంపేట్ మాజీ డిప్యూ టీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రం గనాయప్రసాద్, మాజీ కార్పొరేటర్ సుజా త, నాయకులు బొబ్బ శ్రీనివాస్, ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, అజయ్ వర్మ, శ్రీశైలం యాదవ్, మల్లేష్ పాల్గొన్నారు.

అన్నదానాలు...మహిళలకు చీరెల పంపిణీ 

మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.  భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వనస్థలిపురం డివిజన్ లోని శ్రీ శ్రీనివాసపురం కాలనీ,  ప్రశాంత్‌నగర్ కాలనీలోని సాయిబాబా ఆలయాల్లో కార్పొరేటర్ రాగు ల వెంకటేశ్వర్ రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.