10-07-2025 06:53:11 PM
మునగాల: భక్తజనం మధ్య గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ రామలింగేశ్వర దేవాలయంలో వేయించి ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి పారవశ్యంలో జరుపుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యంతపవిత్రంగా పూజలో మునిగిపోయారు. భక్తులు సాయి దేవాలయానికి తరలివెళ్లారు. భక్తులతో దేవాలయం పోటెత్తింది. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు దేవాలయంలో పూజలు చేశారు. మహిళలు, పిల్లలు సాయి పూజలో నిమగ్నయ్యారు. షిరిడీ సాయిబాబాను భక్తులు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వేద పండితులతో అర్చనలు, పూజలు చేపించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని షిరిడిసాయి దేవాలయంలో పవిత్ర గంగాజలంతో జరిగిన అభిషేకం విశేషంగా చెప్పుకోవచ్చు వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ చేశారు. గురు పౌర్ణమి వేళ భక్తులతో దేవాలయం ప్రాంగణం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో నల్లపాటి శ్రీనివాసరావు. పి. వి డి. ప్రసాద్. వంగవీటి గురుమూర్తి. దాసరి వెంకన్న. పోస్ట్ వెంకన్న. దేవాలయ అర్చకులు మహిళా భక్తులు పాల్గొన్నారు.