calender_icon.png 11 July, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే

10-07-2025 06:48:39 PM

ఎంపీ ఈటెల రాజేందర్..

మేడ్చల్ (విజయక్రాంతి): పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులేనని, జ్ఞానాన్ని నేర్పించేది గురువు అని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్(MP Etela Rajender) అన్నారు. గురువారం మేడ్చల్ మండలం అత్వెల్లిలోని నారెడ్డి నందా రెడ్డి సునంద రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవం సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువల గురించి నేర్పాలి అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మంచిది కాదని అమెరికాలో రుజువైందని, దాని వెనుక మనము పరుగులు తీయవద్దన్నారు.

ఉమ్మడి కుటుంబాలే గొప్పవని, కానీ ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదన్నారు. తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల ఎలా ఉండాలో తాతయ్య నానమ్మలు బోధించేవారని, కానీ ప్రస్తుతం వారు లేనందున పిల్లలు పక్కదారులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలకు నందా రెడ్డి అన్ని విధాలుగా సహాయ పడడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, అత్వెల్లి పాఠశాలలో సంఖ్య ఎక్కువగా ఉండడం చెప్పుకోదగిన విషయం అన్నారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎంపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాత నందా రెడ్డి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్, జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.