06-09-2025 12:24:58 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 5 (విజయ క్రాంతి): పారమిత వరల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకర్ మొహరిర్ కు ప్రతిష్టాత్మకమైన గురుబ్రహ్మ అవార్డు లభించింది. ఎస్‌ఆర్‌ఎఫ్ నిర్వహించిన ఒలంపియాడ్ టెస్ట్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డా. జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీకర్ ను పారమిత విద్యాసంస్థల చైర్మెన్ డాక్టర్ ఇ ప్రసాద్ రావు, డైరెక్టర్స్ ప్రసూన,అనుకర్ రావు, వి. యు.యం ప్రసాద్, రష్మిత, టి. యస్.వి ర మణ, రాకేష్ , హన్మంతరావు, ఉపాధ్యాయులుఅభినందించారు.